»A Devotee Who Made A 400 Kg Lock For The Ram Mandir Temple In Ayodhya
Ayodhya: ఆలయం కోసం..ప్రపంచంలోనే అతిపెద్ద తాళం తయారు
ప్రపంచంలోనే అతిపెద్ద తాళం చుశారా? లేదా అయితే ఇప్పుడు చూడండి. అయితే అతను దీన్ని ఆయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర్ ఆలయం కోసం నిర్మించడం విశేషం. దీని బరువు ఎంత? దాని తయారీ కోసం ఎంత ఖర్చు అయ్యిందో ఇప్పుడు చుద్దాం.
A devotee who made a 400 kg lock for the Ram Mandir temple in Ayodhya
Ram Mandir: ఆలయాలకు భక్తులు ఏదైనా కానుక ఇవ్వడం ఆనాదిగా వస్తున్నదే. అయినా సరే చాలా మంది తము వైవిధ్యంగా ఆలోచించి వార్తల్లో నిలుస్తారు. కొంత మంది విగ్రహాలకు వెండి(Silver), బంగారు(Gold) కిరీటాలు తయారు చేయిస్తే.. మరి కొందు దేవుడి హారాలు లాంటివి కూడా చేయిస్తారు. అయితే ఓ వ్యక్తి 400 కేజీల బరువైన తాళాన్ని(Lock) స్వయంగా తానే చేసి వార్తల్లో నిలిచాడు. అయోధ్య(Ayodhya)లో నిర్మిస్తున్న భవ్య రామ మందిరం కోసం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ నిపుణుడు ఈ తాళం తయారు చేశారు. తాళాల నగరంగా పేరున్న అలీగఢ్‌కు చెందిన సత్యప్రకాశ్ శర్మ రాముడికి అపరమైన భక్తుడు. అతను వృత్తిరిత్యా తాళాల తయారీలో నిపుణుడు.
ఆయన కుటుంబం 100 సంవత్సరాలకు పైగా తాళాల తయారీ పనులు చేస్తోంది. మరోవైపు, అయోధ్య రామాలయం కోసం సత్యప్రకాశ్ శర్మ కొన్ని నెలలపాటు శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్దదైన చేతితో తయారుచేసిన తాళాన్ని రూపొందించారు. దీనిని త్వరలోనే అయోధ్యలో రామాలయ అధికారులకు అందించనున్నారు. అయోధ్య ఆలయాన్ని దృష్టిలో ఉంచుకుని పది అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అడుగుల మందంతో తాళాన్ని, నాలుగు అడుగుల చెవిని తయారుచేశానని శర్మ తెలిపారు. ఈ తాళాన్ని ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన వార్షిక అలీగఢ్ ప్రదర్శనలో ఉంచారు. ప్రస్తుతం శర్మ తాళానికి సంబంధించి అతి సూక్ష్మ మార్పులు, వివిధ రకాల అలంకరణలు చేస్తున్నారు. ఈ తాళం తయారీలో తన భార్య రుక్మిణి ఎంతగానో సహకరించిందని, తయారీకి రూ.2 లక్షలు వెచ్చించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.