W.G: తాడేపల్లిగూడెం (M) కుంచనపల్లి శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ ధనుర్మాస సేవ నిర్వహించారు. స్వామి వారికి పోతురాజు త్రిమూర్తులు – వినయశ్రీ దంపతులు తోమాల సేవ, అభిషేకాలు జరిపారు. ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ దాసరి మల్లికార్జునరావు మాట్లాడుతూ.. 30న ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.