KRNL: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను అమరావతి సచివాలయంలో కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో మౌలిక వసతులు, అభివృద్ధి పనులు, ప్రజల అవసరాలపై మంత్రితో చర్చించామన్నారు.