NZB: వేల్పూర్ మండలం రామన్నపేట్ ఉప సర్పంచ్‌గా ఎన్నికైన గౌరీ నవీన్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. శనివారం రాజీనామా పత్రాన్ని జిల్లా పంచాయతీ అధికారికి, మండల పరిషత్ అధికారికి అందజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్త ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుందని ఎంపీడీవో బాలకిషన్ తెలిపారు.