Budget 2024 : బడ్జెట్ లో ఇస్రోకు 13 వేల కోట్లు కేటాయింపు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో భారత అంతరిక్ష రంగానికి పెద్దపీట వేశారు. ఇందుకు గాను ఇస్రో శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి, నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Budget 2024 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో భారత అంతరిక్ష రంగానికి పెద్దపీట వేశారు. ఇందుకు గాను ఇస్రో శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి, నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 2024 నుంచి 2025 వరకు ఇస్రోకు 13 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆమె తెలిపారు. గతేడాది 12,500 కోట్ల రూపాయలు కేటాయించగా, ఈసారి దాదాపు 500 కోట్ల రూపాయలు అందజేశామన్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ చంద్రయాన్-3, ఆదిత్య ఎల్-1 వంటి అద్భుతాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించడాన్ని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలకు కేంద్ర ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందన్నారు.