ISRO – GSLV-F14 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి అద్భుతాన్ని తన ఖాతాలో వేసుకుంది. GSLV- F14 రాకెట్ ఇవాళ నింగిలోకి దూసుకెళ్లింది. దానిలో భాగంగా.. సాయంత్రం 5గంటల 35 నిమిషాలకు తిరుపతి జిల్లా షార్‌లోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుండి GSLV-F14 రాకెట్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా నింగిలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా.. ఏడాదికి 30 రాకెట్ ప్రయోగాలు చేపట్టే ప్రక్రియలో ఇస్రో మరో అడుగు ముందుకేయనుంది. వాతావరణ పర్యవేక్షణ జియోసింక్రోనస్ ఉపగ్రహం INSAT-3DSని ఇస్రో ప్రారంభించబోతోంది. ఈ ఉపగ్రహం ప్రత్యేకత ఏమిటంటే.. ఇది భూమి వాతావరణం గురించి చాలా ఖచ్చితమైన అంచనాలను చేస్తుంది.
INSAT-3DS ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో GSLV Mk II రాకెట్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఉపగ్రహం టేకాఫ్ అయిన 20 నిమిషాలకే జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో చేరుతుందని చెబుతున్నారు. ఇదే జరిగితే రానున్న కాలంలో వాతావరణంపై కచ్చితమైన సమాచారం అందే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. దీని వల్ల రైతులు గరిష్ట ప్రయోజనం పొందడంతో పాటు సామాన్యుల జీవనం కూడా సులభతరమవుతుంది. ఈ శ్రేణికి చెందిన చివరి ఉపగ్రహం INSAT-3DR 2016లో ప్రయోగించబడింది.