»Indian Origin Astronaut Sunita Williams Set To Fly Into Space Again
Sunita Williams : గణేషుడి విగ్రహంతో మరోసారి రోదసిలోకి సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ మూడోసారి స్పేస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అది తన సొంతిల్లులా ఉంటుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా ఆమె ఏమంటున్నారంటే..?
Astronaut Sunita Williams : సునీతా విలియమ్స్… ఈ పేరు వినగానే అందరికీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో గాలిలో తేలిపోతూ ఉన్న ఆమె ఫోటోలే అందరికీ గుర్తొస్తాయి. ఇప్పటికే రెండు సార్లు స్పేస్‌లోకి వెళ్లొచ్చిన ఈ భారత సంతతి ఆస్ట్రోనాట్(Indian-Origin Astronaut) ఇప్పుడు మూడో రోదసిలోకి పయనం అవుతున్నారు. మే ఏడో తేదీన భారత కాలమానం ప్రకారం ఉదయం 8:04 గంటలకు ఆమె స్పేస్‌షిప్ ద్వారా ఆకాశంలోకి వెళుతున్నారు. ఇందులో ఆమె మిషన్ పైలెట్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
మూడోసారి స్పేస్‌లోకి వెళుతున్న సందర్భంగా సునీతా విలియమ్స్(Sunita Williams) మాట్లాడారు. తాను చాలా స్పిరిట్యువల్ అంటూ చెప్పుకొచ్చారు. గణేషుడు తన లక్కీ ఛార్మ్ అన్నారు. అందుకనే స్పేస్‌లోకి కూడా విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని తీసుకువెళతానని చెప్పారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళితే తన ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుందన్నారు.
స్పేస్‌లో కూర్చుని సమోసా రుచిని ఆస్వాదించడం అంటే తనకు ఎంతో ఇష్టమని సునీతా విలియమ్స్ చెప్పుకొచ్చారు. మంగళవారం వెళ్లబోయే రాకెట్లో సునీతా విలియమ్స్‌తో(Sunita Williams) పాటు బచ్ విల్మోర్ అనే మరో వ్యోమగామి సైతం స్పేస్ క్రాఫ్ట్‌లో పయనించనున్నారు. వారిద్దరూ ఐఎస్ఎస్కు చేరుకుని అక్కడ వారం రోజుల పాటు ఉండనున్నారు. ఆ తర్వాత వారు భూమికి చేరుకుంటారు.