»The Only Creature That Gave Birth To 33 Children In Space What Scientists Say
Space: అంతరిక్షంలో 33 పిల్లలకు జన్మనిచ్చిన ఏకైక జీవి..సైంటిస్టులు ఏమన్నారంటే
అంతరిక్షంలో ఓ జీవి 33 మంది పిల్లలకు జన్మనిచ్చింది. సుమారు 12 రోజుల పాటు ఆ జీవి అంతరిక్షంలో ఉండి అక్కడే గర్భం దాల్చి, పిల్లలకు జన్మనివ్వడంపై సైంటిస్టులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అంతరిక్షంలో జీవించడం కోసం ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు సాగుతున్నాయి. అలాగే అంతరిక్షంలో పునరుత్పత్తి అనేది సాధ్యం అవుతుందా? అని కూడా మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానంగా పరిశోధకులు చాలా రోజులుగా పలు ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. తాజాగా వారు చేపట్టిన ప్రయోగం ఎట్టకేలకు విజయవంతం అయ్యింది. సైంటిస్టులు చేపట్టిన ఈ ప్రయోగంలో ఓ జీవి ఏకంగా 33 మంది పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో అంతరిక్షంలో గర్భందాల్చి, పిల్లల్ని కన్న ఏకైక జీవిగా అది రికార్డుకెక్కింది. ఆ జీవి మరేదో కాదు..అదే బొద్దింక.
అంతరిక్షంలో బొద్దింక ఏకంగా 33 మంది పిల్లలకు జన్మనివ్వడం సైంటిస్టులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. రష్యా శాస్త్రవేత్తలు 2007లో దీనికి సంబంధించిన పరిశోధనలను ప్రారంభించారు. ఫోటాన్ ఎం బయో ఉపగ్రహం సాయంతో హోప్ అనే రష్యన్ బొద్దింకను శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. ఆ బొద్దింక 12 రోజుల పాటు అంతరిక్షంలో గడిపింది. 33 పిల్లలకు ఆ బొద్దింక జన్మనిచ్చింది. అన్ని బొద్దింక పిల్లలు పుట్టిన తర్వాత అవి బాగా తినడం, తాగడం వంటివి చేశాయి.
సాధారణంగా బొద్దింకలు భూమిపై పుట్టిన తర్వాత వాటి వీపుపై ఓ షెల్ తయారవుతుంది. అది కాలక్రమేణా వయసు పెరిగేకొద్దీ బంగారం రంగులోకి మారుతుంది. అయితే అంతరిక్షంలో పుట్టిన బొద్దింక పిల్లలకు అలా జరగలేదు. వారి వీపుపై ఉండే కారపేస్ పుట్టుకతోనే నల్లగా మారిపోయింది. ఆ తర్వాత అది ముదురు రంగులోకి మారుతూ వచ్చింది. వాటి శరీరంలో మార్పులు కూడా జరిగాయి. గురుత్వాకర్షణ శక్తి వల్ల వాటి శరీరంలో మార్పు జరగడం ప్రారంభమైంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి భూమిపై జరిగేవి స్పేస్లో జరగదని సైంటిస్టులు భావించారు.