MHBD: చేపల పెంపకంతో మత్స్యకారులు ఆర్ధికంగా ఎదగాలని జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్ కోరారు. ఆదివారం దంతాలపల్లి, బొడ్లాడ, రామవరం, గున్నెపల్లి, ఆగాపేట, పెద్దముప్పారం చెరువుల్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఉచిత చేప పిల్లలను వదిలారు. చేపల పెంపకంతో ప్రతి కుటుంబం లబ్ది పొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.