MBNR: జడ్చర్ల మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన కాగుల కేశవులు యాదవ్ (40) ఆదివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు ఇంటి వద్ద ఉన్న నీటి గుంతలో పడి ఊపిరి ఆడక మరణించాడు. మృతుని భార్య కాగుల యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు SI మల్లేష్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.