VSP: కోటవురట్ల మండలంలో 25 పంచాయతీల్లో సోమవారం ఉదయం ఏడు గంటలకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం అయింది. ఎంపీడీవో చంద్రశేఖర్ కోటవురట్ల శివారు రాట్నాలపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను కలిసి బయోమెట్రిక్ తీసుకుని పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. సాయంత్రానికి పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించామని తెలిపారు.