ATP: ‘దిత్వా’ తుపాను ప్రభావంతో రాగల 2 రోజులు ఉమ్మడి జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం. విజయ శంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి. నారాయణస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు రాయలసీమ జిల్లాలకు వర్షసూచన ఉందన్నారు. దీంతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.