MBNR: భూత్పూర్ మండలంలో వరి కోతల అనంతరం కొందరు రైతులు వరి కొయ్యలు వ్యర్థాలను తగలబెట్టడంపై ఏఈవో మురళీధర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల భూమిలో కార్బన్ శాతం తగ్గిపోయి, కొంతకాలానికి భూమి నిస్సారంగా మారుతుందని హెచ్చరించారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా, వాటిని భూమిలోనే కలియదున్నడం ద్వారా భూసారం పెరిగి, భూమికి అవసరమైన పోషకాలు అందుతాయని ఆయన సూచించారు.