MHBD: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించాలని బీసీ నేత, సామాజిక వేత్త డోనికెన కుమారస్వామి కోరారు. బీసీ నేతలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే ప్రయత్నం ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఫలించలేదన్నారు. దీంతో చాలా స్థానాలను బీసీలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.