లక్ష్యసాధన కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా ఓ ఆలోచన వస్తుంది. ఇక ఈ ఒత్తిడిని, కష్టాలను భరించడం మనవల్ల కాదని, ప్రయత్నాలను ఇంతటితో ఆపేద్దామని అనిపిస్తుంది. ఆ సందర్భంలో మీరు తీసుకునే నిర్ణయమే మిమ్మల్ని విజేతగానో లేక పరాజితుల్లో ఒకరిగానో మారుస్తుంది. మీరు విజేతగా నిలవాలంటే ఎట్టిపరిస్థితల్లోనూ వెనకడుగు వేయకండి.