ADB: హైదరాబాద్ నుంచి గోరఖ్‌పూర్‌కు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నేరేడిగొండ మండలం బోత్ ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ మేరకు జిల్లా SP అఖిల్ మహాజన్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. అతివేగం, నిర్లక్ష్యమే బస్సు ప్రమాదానికి కారణమని ఎస్పీ తెలిపారు. హెచ్చరిక బోర్డులు ఉన్న ప్రాంతాలలో వేగాన్ని నియంత్రించి నడపాలని కోరారు.