NLG: చండూరు మండలం బంగారుగడ్డ సర్పంచ్‌గా గ్రామానికి చెందిన మహమ్మద్ సమీనాను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గౌరవానికి సంతోషించిన ఆమె, గ్రామ అభివృద్ధికి తన వంతుగా రూ.73 లక్షలు కేటాయిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఏకగ్రీవ ఎన్నికల సంప్రదాయాన్ని కొనసాగించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.