WGL: నేడు ప్రపంచ ఎయిడ్స్ డే. జిల్లాలో ఇప్పటి వరకు 5,464 మంది హెచ్ఐవీ బాధితులు నమోదు కాగా, వీరిలో 4,558 మందికి ప్రభుత్వం ప్రతి నెల ఉచిత మందులు అందిస్తోంది. 863 మంది బాధితులకు ఏఆర్జే ద్వారా నెలకు రూ. 2,016 పెన్షన్ ఇస్తున్నారు. నెలకు సగటున 36 కొత్త హెచ్ఐవీ కేసులు వెలుగులోకి వస్తుండటం, ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో హై రిస్క్ వ్యక్తులు 3,498 మంది ఉన్నారు.