NLG: దిత్వా తుఫాన్ ప్రభావం కారణంగా డిసెంబర్ 2 నుంచి 5 వరకు తీవ్ర వర్ష ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా దీని ప్రభావం ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాలు, చలికాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లాల అధికారులు పేర్కొన్నారు.