WG: ధాన్యం కొనుగోలుపై అధికారులు ఎన్ని ప్రకటనలు చేసినా తూకాల్లో మోసాలు, తేమశాతం పేరుతో దోపిడి ఆగడం లేదని ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు విమర్శించారు. జిల్లాలో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లు పరిశీలించేందుకు ఆదివారం పెనుమంట్ర, ఇరగవరం, పెనుగొండ, పోడూరు మండలాల్లో పర్యటించి, ధాన్యం కొనుగోలు సమస్యలపై రైతులతో మాట్లాడారు.