ASR: ఈనెల 7న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష జరుగుతుందని డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ పరీక్షకు జిల్లా నుంచి 726 మంది విద్యార్థులు ధరఖాస్తు చేసుకున్నారన్నారు. పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, వీఆర్ పురం, చింతూరులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పాఠశాల లాగిన్లో ఉంటాయన్నారు