CTR: పులిచెర్ల మండలం 102 ఈ రామిరెడ్డి గారిపల్లిలో సోమవారం ఉదయం 6:30 గంటలకు పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి) పర్యటిస్తున్నట్టు టీడీపీ నాయకులు కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరవుతారన్నారు. మండలంలోని TDP నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలన్నారు.