మెదక్ జిల్లాలో రెండవ విడతలో మొదటి రోజు ఆదివారం 155 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు సమర్పించారు. 8 మండలాల్లో 149 స్థానాలున్నాయి. చేగుంట-38, మనోహరాబాద్-23, మెదక్-20, నార్సింగి-3, నిజాంపేట్-18, రామాయంపేట-11, చిన్నశంకరంపేట 38, తుప్రాన్-14 చొప్పున సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు సమర్పించారు. ఆలాగే వార్డు స్థానాలకు 280 మంది నామినేషన్లు సమర్పించారు.