ATP: అంతర్ జిల్లా సీనియర్ హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొనే పురుషుల జట్టును సోమవారం ఎంపిక చేయనున్నట్లు జిల్లా హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి ఎస్. శివశంకర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు అనంతపురంలోని ఎల్ఆర్ పాఠశాలలో ఎంపిక పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఆధార్ కార్డుతో హాజరు కావాలని సూచించారు.