ASR: దిత్వా తుఫాను ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. నిన్న సాయంత్రం నుంచి జిల్లాలో వాతావరణం మారిపోయింది. కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి తదితర మండలాల్లో రాత్రి తేలికపాటి వర్షం కురిసింది. సోమవారం ఉదయం కూడా వాతావరణం ముసురుకొని ఉంది. కొయ్యూరు తదితర మండలాల్లో వరిపంట పండిపోయి కోత దశలో ఉంది. కొన్నిచోట్ల రైతులు పంట కోతల్లో ఉన్నారు.