ASF: తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని మాణిగ్గర్ – విర్గాం సమీపంలో రైలుప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం సిర్పూర్ శివారులో రైలు ఢీకొనడంతో పులి అక్కడికక్కడే మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించామన్నారు. పులి ట్రాక్‌పైకి ఎలా చేరిందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.