HYD: సికింద్రాబాద్లో క్రిస్మస్ సంబరాలు ముందుగానే మొదలయ్యాయి. సెయింట్ ఆండ్రూస్ చర్చ్ గోపురం, గోడల పై వెలిగిన రంగురంగుల ఫెయిరీ లైట్లు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. దాదాపు 75 ఏళ్లుగా ఇక్కడ ప్రార్థనలు చేస్తున్న ఆర్తడాక్స్ సిరియన్ క్రైస్తవ సంఘం కోసం ఈ చారిత్రక చర్చ్ మరోసారి ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడుతోంది.