Israel War: 24 గంటల్లో 700 మంది మృతి.. డెత్‌జోన్‌గా గాజా!
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా 24 గంటల్లో మరో 700 మందికి పైగా దుర్మరణం చెందారు. ఇప్పటి వరకూ ఈ యుద్ధం కారణంగా 6 వేల మంది చిన్నారులు ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం డెత్ జోన్‌గా గాజా సిటీ మారిపోయింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas War) ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎంతో మంది అమాయకుల ప్రాణాలను ఈ యుద్ధం బలితీసుకుంటూనే ఉంది. తాజాగా 24 గంటల్లో 700 మందికి పైగా దుర్మరణం (700 died) చెందారు. ఇజ్రాయెల్ నరమేధం వల్ల 700 మంది పాలస్తీనియన్లు మరణించినట్లుగా ఆ దేశ ఆర్మీ ప్రకటించింది. యుద్ధం కారణంగా 15 లక్షల మందికి పైగా నిర్వాసితులుగా మారారని, గాజా (Gaza)పై దాడులు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
గతంలో ఇజ్రాయెల్, గాజా మధ్య సంధి కుదిరింది. బందీలు-ఖైదీల మార్పిడి కోసం సంధి జరగ్గా కొన్ని రోజుల పాటు యుద్ధం ఆగింది. అంతేకాదు ఈ సంధి వల్ల కొంత మంది బంధీలు ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే మరికొందరు ఖైదీలు కూడా విడుదల అయ్యారు. అయితే ఇకపై అలాంటి చర్చలు, సంధి వంటివి జరగబోవని హమాస్ తేల్చి చెప్పింది. మరోవైపు హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపణ చేస్తోంది.
ప్రస్తుతం గాజా (Gaza) వద్ద పరిస్థితి చూస్తుంటే దారుణంగా ఉంది. గాజాలోని ఆస్పత్రుల వద్ద భయానక దృశ్యాలు వెలుగుచూశాయి. గాజా ఇప్పుడు డెత్ జోన్‌గా మారిందని యూనిసెఫ్ (Unicef) ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గాజాలో ఎక్కడ చూసినా పిల్లలు, మహిళలపై థర్డ్ డిగ్రీ కాలిన గాయాలతో కనిపిస్తున్నారు. విరిగిన కాళ్లు చేతులతో దర్శనమిస్తున్నారు. పదునైన ఆయుధాలతో గాయాలపాలైన వారు కనిపిస్తున్నారు. ఓ వైపు యుద్ధం (war) వల్ల గాయాలు, మరో వైపు వ్యాధుల వల్ల అనారోగ్యం వారిని వేధిస్తోందని జేమ్స్ వెల్లడించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆరువేల మందికి పైగా పిల్లలు మరణించినట్లు యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ (UNRWA) డైరెక్టర్ థామస్ వైట్ ప్రకటించారు.