»Nasa Hubble Diwali Festival Of Lights From Space Viral Video
Viral video: అంతరిక్షం నుంచి దీపావళి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్
మీరెప్పుడైనా అంతరిక్షం నుంచి దీపావళి వేడుకలను చుశారా? లేదా అయితే ఈ వీడియోను తప్పుకుండా చూడాల్సిందే. ఎందుకంటే ఇటివల నాసా దీపావళి వేడుకల దృశ్యాలను అంతరిక్షం నుంచి చీత్రీకరించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి చూసిన జనాలు వావ్ అంటున్నారు.
nasa hubble Diwali festival of lights from space viral video
దీపావళి(deepawali) పండుగ అంటేనే వెంటనే గుర్తుకొచ్చేది టపాసులు కాల్చడం. అయితే ఈ పండగను భారత్ తోపాటు మరికొన్ని దేశాల్లో కూడా ఒకేసారి జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఇటివల పండుగ సందర్భంగా హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా అంతరిక్షం నుంచి దీపావళి వేడుకలను షూట్ చేశారు. ఆ విధంగా బంధించిన గ్లోబులర్ వీడియోను నాసా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. అంతరిక్ష సంస్థ గ్లోబులర్ క్లస్టర్‌ను “కాంతుల పండుగ” అని పిలిచింది. గ్లోబులర్ క్లస్టర్ భూమికి 30,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని..ఇది పాలపుంత గెలాక్సీకి సమీపంలో ఉందని తెలిపింది.
వీడియోలో గ్లోబ్ ను చూపిస్తు పలు చోట్ల వెలుగుతున్న లైట్లు కనిపిస్తుండగా..మరికొన్ని చోట్ల చీకట్లు అలుముకున్నాయి. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువురు వీడియో అదిరిందని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో గెలాక్సీ మధ్యలో ఉన్న దట్టమైన నక్షత్రాల సమూహం కూడా కనిపించడం విశేషం. హబుల్ టెలిస్కోప్ వైడ్ ఫీల్డ్ కెమెరా 3 ఈ వీడియోను చిత్రీకరించారు. ఎందుకంటే మానవ కన్ను గుర్తించలేని కాంతి తరంగదైర్ఘ్యాలకు ఇది సున్నితంగా గుర్తించగల్గుతుంది. ఈ వీడియోను నాసా(NASA) సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..ఇప్పటికే రెండు లక్షల మందికిపైగా వీక్షించారు. ఈ నేపథ్యంలో ఈ వీడియోను షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారు.
Happy Diwali ✨
We want to wish everyone celebrating an amazing Festival of Lights, with this wonderful night view of Earth from the @Space_Station!