TCS: వ్యాపారాల్లో ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రాధాన్యం పెరుగుతోంది. క్లౌడ్, ఐఓటీ వంటి వాటిలో ఉన్న శక్తిని కంపెనీలు అందుకుంటున్నాయి. సాంకేతికతపై పెట్టుబడులు పెడుతున్నామని టీసీఎస్ (TCS) చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ( Chandrasekaran) పేర్కొన్నారు. షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో ఈ అంశాలను వివరించారు.
గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్‌లో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. తమ కంపెనీ 17.6 శాతం వృద్ది సాధించిందని తెలిపారు. 34.1 బిలియన్ డాలర్ల విలువ జేసే ఆర్డర్లతో గత ఏడాది మంచి ప్రదర్శన కనబరిచామని ప్రస్తావించారు. పరిశ్రమల్లో వస్తోన్న మార్పులకు అనుగుణంగా టీసీఎస్ (TCS) కంపెనీ వ్యవహరిస్తోందని చంద్రశేఖరన్ ( Chandrasekaran) తెలిపారు. ఏఐ సాంకేతికతతో పెట్టుబడులు పెడుతున్నామని వివరించారు. కొత్త సాంకేతికత, ఆవిష్కరణల్లో గణనీయ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇదీ ఐటీ ఇండస్ట్రీ వృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు. ఏఐ ఆధారిత ఉత్పత్తులపై టీసీఎస్ దృష్టిసారించిందని పేర్కొన్నారు.
5జీ, ఐవోటీ, జనరేటివ్ ఏఐ, వర్చువల్ రియాలిటీ, మెటావర్స్, డిజిటల్ ట్విన్ వంటి కొత్తతరం సాంకేతికల్లో పెట్టుబడులు పెరుగుతాయని అంటున్నారు. వీటికి అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందిస్తామని చెబుతున్నారు. ఇటీవల కంపెనీని వీడిన సీఈవో రాజేశ్ గోపినాథన్ను (rajesh) చంద్రశేఖరన్ ధన్యవాదాలు తెలియజేశారు. కంపెనీ వృద్ధిలో అతని పాత్ర కీలకం అని గుర్తుచేశారు. అతని స్థానంలో బాధ్యతలు స్వీకరించిన కే కార్తీ వాసన్‌కు ఈ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేశారు.