Magunta Raghava Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవరెడ్డికి (Magunta Raghava Reddy) మధ్యంతర బెయిల్ మంజూరు అయ్యింది. ఈ కేసులో రాఘవరెడ్డి నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. రాఘవరెడ్డి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు. ఫిబ్రవరి 10వ తేదీన రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా.. ఇన్నాళ్లూ తీహార్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్నారు. ఈ రోజు మధ్యంతర బెయిల్‌ను స్పెషల్ కోర్టు మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఇండో స్పిరిట్స్ సంస్థ యజమాని సమీర్ మహేంద్ర (sameer mahendra) సెప్టెంబర్ 28వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. అరబిందో గ్రూప్ – ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ పీ శరత్ చంద్రా రెడ్డిని (sharath chandra reddy) నవంబర్ 11వ తేదీన, పెర్నార్డ్ రిచర్డ్ కంపెనీకి చెందిన బినొయ్ బాబును నవంబర్ 11న.. అభిషేక్ బోయినపల్లి (abhishek) నవంబర్ 13వ తేదీన అరెస్ట్ చేశారు. విజయ్ నాయర్ నవంబర్ 13వ తేదీన.. బడ్డీ రిటెయిల్ సంస్థ డైరెక్టర్ అమిత్ అరోరాను (amith arora) నవంబర్ 29వ తేదీన.. ఫిబ్రవరి 8న గౌతమ్ మల్హోత్రా (gautham malhotra).. చారియట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రాజేష్ జోషి (rajesh joshi)ను ఫిబ్రవరి 9వ తేదీన.. ఫిబ్రవరి 11వ తేదీన మాగుంట రాఘవ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ అయ్యారు.
లిక్కర్ స్కామ్‌లో కవిత, మాగుంట శ్రీనివాసుల రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. కవితను పలుమార్లు ప్రశ్నించింది. మూడు పర్యాయలు 8 నుంచి 10 గంటల పాటు కొశ్చన్ చేసింది. మొబైల్స్ ధ్వంసం, సౌత్ గ్రూప్ మెయింటైన్ చేయడం.. తదితర అంశాలపై ప్రశ్నలు వేసింది. కవితతోపాటు మాగుంట శ్రీనివాసుల రెడ్డి సౌత్ గ్రూప్‌ను మెయింటైన్ చేశారని ఈడీ ఆరోపిస్తోంది.