Fake Cakeతో జర జాగ్రత్త.. అగ్గువకే వస్తుందని కొంటే అంతే సంగతులు
తక్కువ ధరకే వస్తోందని కేక్ కొనుగోలు చేయకండి. ఆ కేక్ తిని మీ పిల్లలు, ఇంటిల్లిపాది అనారోగ్యం పాలు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ శివారులో ఎస్వోటీ పోలీసులు కొన్ని కేక్ ఫ్యాక్టరీ, కేక్ షాపుల్లో దాడులు చేశారు.
Fake Cake: అన్నింటిలో కల్తీ, పప్పు, బియ్యం.. చివరికీ కేక్ (cake) కూడా అంతే. నాసిరకం ఉత్పత్తులతో తయారు చేస్తూ.. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పక్కా ఇన్ఫర్మేషన్తో హైదరాబాద్ ఎస్వోటీ పోలీసులు శివారు ప్రాంతాల్లో ఉన్న కేక్ ఫ్యాక్టరీ, కేక్ షాపుల్లో దాడులు నిర్వహించారు. కేక్ నిల్వ ఉంచిన ఫ్రీజ్, తయారు చేస్తోన్న ప్రాంతం చూసి షాక్‌నకు గురయ్యారు. కేక్ తయారు చేస్తోన్న పదార్థాలను చూసి నోరెళ్లబెట్టారు.
ఐస్ క్రీమ్ తర్వాత కేక్స్
హైదరాబాద్‌లో (Hyderabad) కల్తీ పదార్థాల తయారీ గురించి పోలీసులకు సమచారం వస్తోంది. దాంతో ఇటీవల రైడ్ (raid) చేయగా నకిలీ ఐస్ క్రీమ్ తయారు చేసే ముఠా బండారం బయటపడింది. ఇప్పడు కేకులు (cakes), స్వీట్లను (sweets) తయారు చేస్తున్నారు. బాచుపల్లి పరిధిలో గల నిజాంపేటలో బాలాజీ కేక్ ఫ్యాక్టరీలో (balaji cake factory) కల్తీ కేకు తయారు చేస్తున్నారనే సమాచారంతో బాలానగర్ ఎస్వోటీ (balanagar sot) సోదాలు నిర్వహించారు. కేకుల తయారీలో రసాయన రంగులు ఉపయోగిస్తున్నారని గుర్తించారు. కేక్ తయారు చేసే చోట ఏ మాత్రం నీట్‌గా లేదని గుర్తించారు. ఆ షాపు ఓనర్ గోపాలకృష్ణ (gopala krishna) పరారీలో ఉండగా.. పనిచేస్తోన్న సయ్యద్ వాసిఫ్, కేక్ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
పాచిపోయిన సామాగ్రి
ఎక్స్పైరీ డేట్ అయిన క్రీములు, పాచిపోయిన కేక్ తయారీ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి కేక్ తయారు చేస్తున్నారని గుర్తించారు. ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ సేప్టీ లైసెన్స్, లేబర్ లైసెన్స్ లేకుండానే కేక్ పరిశ్రమ నడుస్తోందని గుర్తించారు.
ఫేక్ స్వీట్
మొగల్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ మిఠాయి తయారు చేస్తున్నట్టు గుర్తించారు. కలకన్, అజ్మీరీ కలన్, కోవా వంటి స్వీట్లను నకిలీగా తయారు చేస్తున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. బాల్ గోపాల్ యోజన పథకం కింద రాజస్థాన్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తోన్న పాలపొడిని తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తీసుకొస్తున్నారట. ఆ పొడిని కేకుల తయారీలో వినియోగిస్తున్నారు. రసాయనాలతో మిఠాయి తయారు చేసి.. బ్రాండెడ్ కవర్లతో విక్రయిస్తున్నారని గుర్తించారు.