Indian Origin Teacherపై బ్రిటన్ స్కూల్స్ బ్యాన్.. ఎందుకంటే..?
తన ఇంట్లో దొంగతనం జరిగిందని, బీమా ఉందని భారత సంతతి టీచర్ బ్రిటన్‌లో చెప్పింది. విచారణ జరిపితే ఆ బీమా నకిలీదని తేలింది. దర్యాప్తు సంస్థ విచారణ జరిపి, ఆమె ఏ స్కూల్స్‌లో పనిచేయకుండా రెండేళ్లపాటు నిషేధం విధించింది.
Indian Origin Teacher: భారత సంతతికి చెందిన ఓ టీచర్‌పై (teacher) బ్రిటన్ స్కూల్స్ (schools) నిషేధం విధించాయి. రెండేళ్లపాటు బ్యాన్ (ban) కొనసాగుతోందని స్పష్టంచేశాయి. ఇన్సూరెన్స్ తీసుకున్నానని చెప్పడం.. ఆ భీమా నకిలీది కావడంతో దీప్తిపై (deepthi) చర్యలు తీసుకుంది. ఏజెన్సీ (agency) విచారణ జరిపి.. రెండేళ్లపాటు ఏ స్కూల్లో (school) కూడా పనిచేయకుండా నిషేధం విధించింది.
దీప్తి పటేల్ (deepthi patel) పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్)గా పనిచేస్తోంది. 2018లో లండన్ (london) నుంచి బోల్టన్‌కు వచ్చింది. తన ఇంటికి వచ్చిన కొందరు దుండగులు ఇంట్లో చొరబడి తుపాకీ చూపించి దోపిడీకి పాల్పడ్డారని పేర్కొంది. ఇంట్లో దొంగిలించిన వస్తువులకు తన కుటుంబం బీమా క్లెయిమ్ చేసిందని వివరించింది. ఇటీవల జరిపిన విచారణలో బీమా క్లెయిమ్ నకిలీదని తేలింది. బీమా క్లెయిమ్ కేసు విచారణ కోసం కోర్టుకు వెళ్లిన సమయంలో దీప్తి స్కూల్లో అబద్దం చెప్పి వెళ్లారట. ఆ విషయం బయట పడటంతో స్కూల్ యాజమాన్యం షాక్‌నకు గురయ్యింది. ఓ టీచర్ (teacher) ఇలా చేసిందని ఏజెన్సీకి ఫిర్యాదు చేసింది. విచారణ జరిపి దీప్తిపై రెండేళ్ల పాటు బ్యాన్ విధించింది. బ్రిటన్‌లో ఏ స్కూల్ పనిచేసేందుకు వీలు ఉండదు.
తన ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి.. ఇంట్లో ఉన్న వస్తువులకు బీమా క్లెయిమ్ ఉందని చెప్పింది. స్కూల్ యాజమాన్యాన్ని నమ్మించేందుకు అలా చేసింది. కానీ విచారణ జరిపితే బీమా నకిలీదని (fake) రుజువు అయ్యింది. అంటే దొంగతనం కూడా జరగలేదు.. బాధ్యతాయుతమైన టీచర్ పోస్ట్‌లో ఉండి.. ఇలా అబద్ధం చెప్పారని చర్యలకు ఉపక్రమించారు.