Tractor Collides Railway Gate: ఒడిశా (odisha) రైలు ప్రమాదం నుంచి ఇంకా తేరుకునేలేదు. ఇంతలో మరో ప్రమాదం తప్పింది. జార్ఖండ్లో (jharkhand) గల బొకారోలో ఓ రైలుకు రెప్పపాటులో ప్రమాదం తప్పింది. సంతాల్దిహ్ రైల్వే క్రాసింగ్ సమీపంలో రైల్వే గేటును నిన్న సాయంత్రం ఓ ట్రాక్టర్ (tractor) ఢీ కొంది. గేటు, ట్రాక్ మధ్యలో ఇరుక్కుపోయింది. ఆ సమయంలో న్యూఢిల్లీ- భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ అటు వైపుగా వస్తోంది. ఆ ట్రాక్టర్ను గమనించిన లోకో ఫైలట్ (loko pilot) వెంటనే రైలును ఆపివేశారు. పట్టాలపై రైలు ఆగింది.
న్యూఢిల్లీ- భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ వస్తోన్న సమయంలో భోజుదిహ్ స్టేషన్ సంతాల్దిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వేగేటు (Railway Gate) వేశారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ట్రాక్టర్ (tractor) రైలు గేటును బలంగా ఢీ కొట్టింది. రైలు గేటు, పట్టాల మధ్య ట్రాక్టర్ ఇరుక్కుపోయిందని సౌత్ ఈస్టర్స్ రైల్వే డీఆర్ఎమ్ మనీష్ కుమార్ వివరించారు. ట్రాక్టర్ ఇరుకున్న విషయం లోకో పైలట్ గమనించారని పేర్కొన్నారు. అప్రమత్తమైన లోకో పైలట్ బ్రేకులు వేశారని.. దీంతో రైలు ఆగిందని వివరించారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని వివరించారు. రైల్వే గేటును ఢీ కొన్న తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ (driver) అక్కడి నుంచి పరారయ్యారని మనీష్ కుమార్ (manish kumar) తెలిపారు. ఆ ట్రాక్టర్ సీజ్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వివరించారు.