Karate Kalyani: ప్రాణ హానీ ఉందని సినీ నటి కరాటే కళ్యాణి (Karate Kalyani) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరి నుంచి థ్రెట్ ఉందో తెలియజేయలేదు.. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాం కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయగా.. కరాటే కళ్యాణి (Karate Kalyani) అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత యాదవ సంఘాలు ఆందోళన చేయడం.. విషయం కోర్టుకు చేరడంతో విగ్రహా ఆవిష్కరణకు ధర్మాసనం కూడా స్టే విధించింది.
ఇదే అంశంపై ‘మా’ చర్యలకు ఉపక్రమించింది. కరాటే కళ్యాణి (Karate Kalyani) వల్లే ఎన్టీఆర్ విగ్రహాం దుమారం రేపిందని భావించి.. నోటీసు జారీచేసింది. వివరణపై శాటిస్పై కాకపోవడంతో.. ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసింది. తర్వాత మీడియా ముందుకు వచ్చిన కరాటే కళ్యాణి (Karate Kalyani).. తాను ఎన్టీఆర్‌ను ఆరాధిస్తానని..కృష్ణుడి రూపంలో విగ్రహాం ఉండటాన్ని వ్యతిరేకిస్తానని చెప్పారు. తాను చేసిన కామెంట్లకు కట్టుబడి ఉంటానని మరోసారి స్పష్టంచేశారు. తర్వాత ఇష్యూ ఏమీ లేదు. చాలా రోజుల తర్వాత కరాటే కళ్యాణి (Karate Kalyani) మీడియా ముందుకు వచ్చారు.
తనను హత్య చేసేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఇటీవల కొందరు తన కారు రెండు టైర్లను కోసేశారని వివరించారు. టైర్లు కొంచెం కోశారని, దానిని తాను చూడలేదని చెప్పారు. అలా కారులో వెళ్లానని.. కాసేపటి తర్వాత కారు టైర్లు పేలిపోయాయని చెప్పారు. ఘటన హైవే మీద జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. కావాలనే తన కారు టైర్లను కోసివేశారని ఆరోపించారు. ఓ ఆలయం వద్ద గొడవ జరుగుతున్న సమయంలో హిందుత్వ వాదులతో కలిసి అక్కడకు తాను వెళ్లానని కరాటే కళ్యాణి (Karate Kalyani) చెప్పారు. కారులో తిరిగి వస్తోన్న సమయంలో కారు టైర్లు పేలిపోయాయని వివరించారు. కారు హైవే మీద ఉండి ఉంటే.. కారు స్పీడ్‌గా ఉంటే పరిస్థితి ఏంటీ అని అడిగారు. కరాటే కళ్యాణి (Karate Kalyani) చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి.