Car Colour : మీ కారు కలరేంటి? ఈ రంగైతే అదనపు లాభాలు!
మనలో చాలా మంది రకరకాల రంగుల్లో ఉన్న కార్లను కొనుక్కుంటూ ఉంటాం. అయితే అన్ని రంగుల్లోకెల్లా తెల్ల రంగు కారును కొనుక్కోవడం వల్ల ఎన్నో లాభాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే...
Which color car is best? : పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి.. అన్నట్లుగా అంతా కార్లను కొనుక్కునేప్పుడు రకరకాల రంగుల్ని ఎంపిక చేసుకుంటూ ఉంటారు. నలుపు, తెలుపు, ఎరుపు, నీలం… ఇలా నచ్చిన రంగును సెలక్ట్ చేసుకుంటారు. అయితే మిగిలిన రంగుల కార్లతో పోలిస్తే తెలుపు రంగు కార్లను కొనుక్కోవడం వల్ల లాభాలు, ఉపయోగాలు(Benefits) ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకనే దేశంలో దాదాపుగా 25 శాతం కార్లు వైట్ కలర్వే ఉంటాయని అంచనా. మరి కారు కొనుక్కునే ఆలోచనలో ఉంటే మాత్రం ఈ కథనాన్ని తప్పకుండా చదివేయండి.
ఎరుపు, నీలం, నలుపు వంటి ముదురు రంగులు ఎక్కువ కాలం ఎండలో ఉన్నట్లయితే కొంత ఫేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మెరుపు అయినా తగ్గిపోతాయి. అదే తెలుపు రంగు కార్లతో ఆ భయమే ఉండదు. అందుకనే మిగిలిన కార్లతో పోలిస్తే తెలుపు రంగు(white colour) ఉన్న కార్లకు రీసేల్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వేసవి కాలంలో ముదురు రంగుల కార్లలో వేడి ఎక్కువగా ఉంటుంది. వాటతో పోలిస్తే తెలుపు కార్లలో వేడి తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతల వ్యత్యాసం చాలా కనపడుతుంది.
అలాగే రాత్రిళ్లు ప్రయాణం చేసేప్పుడు ముదురు రంగు కార్లతో పోలిస్తే వైట్ కార్లు స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్ల రాత్రిళ్లు జరిగే రోడ్డు ప్రమాదాల నుంచి రక్షణ కలుగుతుంది. అలాగే తెలుపు రంగు అనేది చూడ్డానికి క్లాసిక్గా ఉంటుంది. రాజసానికి ఇది గుర్తు. మిగిలిన రంగుల కార్ల కంటే ఈ తెలుపు రంగు కారును(white colour car) వాడటం వల్ల ఇన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి రంగును ఎంచుకునే సమయం వచ్చినప్పుడు ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలి.