»Mp Sivani Raja Mp Of Indian Origin Who Took Oath On Bhagavad Gita In Uk Parliament
MP Sivani Raja: యూకే పార్లమెంట్లో భగవద్గీతపై ప్రమాణం చేసిన భారత సంతతి ఎంపీ
ఇటీవల బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ పార్లమెంట్లో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్‌లో భారత సంతతికి చెందిన మొత్తం 27 మంది చట్టసభకు ఎన్నికయ్యారు. అయితే ఇందులో ఒకరు శివాని రాజా ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
MP Sivani Raja: MP of Indian origin who took oath on Bhagavad Gita in UK Parliament
MP Sivani Raja: ఇటీవల బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ పార్లమెంట్లో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్‌లో భారత సంతతికి చెందిన మొత్తం 27 మంది చట్టసభకు ఎన్నికయ్యారు. అయితే ఇందులో ఒకరు శివాని రాజా ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. శివాని భగవద్గీతపై ప్రమాణం చేశారు. లైసెస్టర్ ఈస్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ.. పార్లమెంట్లో ప్రమాణం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. రాజుకు విధేయతగా ఉంటానని ఆమె గీతపై ప్రమాణం చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
It was an honour to be sworn into Parliament today to represent Leicester East.
గుజరాత్‌కి చెందిన శివానీ వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు. ఆమె లైసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. భారత సంతతి నేత రాజేశ్ అగర్వాల్‌ను ఓడించి, ఈమె గెలిచారు. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 పార్లమెంటు స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మార్కు 326 సీట్లు కాగా లేబర్ పార్టీ 412 స్థానాల్లో గెలుపొందింది. కన్జర్వేటివ్‌లు కేవలం 121 చోట్ల విజయం సాధించారు. దాంతో రిషి సునాక్ అధికారాన్ని కోల్పోయారు. బ్రిటన్ నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్ బాధ్యతలు స్వీకరించారు.