సత్యసాయి: సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ప్రజలకు పారదర్శకంగా, మెరుగైన సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనితీరుపై ఆయన సమీక్షించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.