Gold and Silver Rates Today : రేటు తగ్గినప్పుడు బంగారం కొనుక్కోవాలని అనుకుంటున్నారా? అయితే రోజూ దీని ధర ఎంత ఉందనేది తప్పకుండా తెలుసుకుంటూ ఉండండి. అప్పుడు మాత్రమే కాస్త తక్కువలో బంగారం కొనుక్కోగలుగుతారు. ఇక గురువారం దేశీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. నేడు రూ.260 పెరిగింది. దీంతో పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.75,070కి చేరుకుంది.
బంగారం ధర(Gold Rate) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ ఇలాగే ఉంది. విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడల్లోనూ 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.75,070గానే ఉంది. ఇది మార్కెట్ ప్రారంభ సమయంలో నమోదైన ధర మాత్రమే. తర్వాత మళ్లీ మారొచ్చు. అలాగే వినియోగదారులు నగల్ని కొనుక్కునేప్పుడు ఈ ధర మాత్రమే కాదండోయ్. అదనంగా రాళ్ల విలువ, జీఎస్టీ, మజూరీల్లాంటివీ చెల్లించాల్సి ఉంటుంది.
ఇక వెండి రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. గత వారం రోజులుగా ఈ లోహం ధరలో తగ్గుదల మాత్రం కనిపించడం లేదు. దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) గురువారం ఉదయం మార్కెట్ ప్రారంభ సమయంలో రూ.360 పెరిగింది. దీంతో కేజీ వెండి నేడు రూ.94,530కు చేరుకుంది. విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ తదితర చోట్ల సైతం దీని ధరలు ఇలాగే ఉన్నాయి. గత మూడు రోజులుగా ఈ రెండు లోహాలు క్రమ క్రమంగా పెరుగుతూ ఉండటం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు పెరిగాయి. నేడు 11 డాలర్లు పెరిగి ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2379 డాలర్లకు చేరుకుంది. ఔన్సు వెండి 31.03 డాలర్లుగా ఉంది.