»Aadhaar Based Ekyc Of Lpg Customers Underway To Weed Out Bogus Users
LPG : సిలిండర్లు వాడే వారంతా ఈకేవైసీ చేయించుకోవాల్సిందే.. కేంద్రం ప్రకటన
ఎల్పీజీ వినియోగదారులంతా ఇకపై ఈకేవైసీని తప్పకుండా చేయించుకోవాలి. ఈ విషయమై కేంద్ర కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Aadhaar Based eKYC for LPG Customers : ఎల్పీజీ సిలిండర్లు కావాలంటే ఇక తప్పకుండా ఆధార్ ఈకేవైసీ(Aadhaar-based eKYC) తప్పకుండా చేయించుకోవాల్సిందే. ఈ విషయంపై కేంద్ర కీలక ప్రకటన చేసింది. ఈ విషయమై కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లడారు. బోగస్ కార్డులను దేశంలో ఏరివేయాలంటే ఈ ప్రక్రియ కీలకమైనదని తెలిపారు. గృహాల్లో ఎల్పీజీలను ఉపయోగించే వినియోదారులకు గ్యాస్ దాదాపుగా రూ.800 ఉంటుంది. అదే హోటళ్లు, రెస్టారెంట్లలాంటి వాటిల్లో ఉపయోగించే 19 కిలోల సిలిండర్ల ధర రూ.1600కు పైబడి ఉంటుంది.
డొమస్టిక్ ఎల్పీజీ(LPG) సిలిండర్‌కు, కమర్షియల్ సిలిండర్‌కు మధ్య ఎక్కువ ధర వ్యత్యాసం ఉంటుంది. ఫలితంగా చాలా మంది వ్యాపారులు బోగస్ గ్యాస్ కార్డులను సృష్టిస్తున్నారు. అదనంగా డొమస్టిక్ వంట గ్యాస్ సిలిండర్లను పొందుతున్నారు. దీంతో ఇలాంటి బోగస్ కార్డులను ఏరివేయడానికి ప్రభుత్వం ఈ ఈకేవైసీ ప్రక్రియను ప్రారంభించింది. గత ఎనిమిది నెలలుగా ఇది కొనసాగుతోంది. అయితే ఇటీవల కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వీడి సతీశన్ ఈకేవైసీ ప్రక్రియ గురించి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ప్రజలు ఈ విధానం వల్ల తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
ఆయన విమర్శలకు కేంద్ర చమురు మంత్రి ఇలా వివరణ ఇచ్చారు. బోగస్ కార్డులను తొలగించేందుకే ఈ ప్రక్రియ అని చెప్పుకొచ్చారు. ఇది తప్పనిసరి అంటూ వివరించారు. ఇంటికి వచ్చిన గ్యాస్ డెలివరీ సిబ్బంది దీన్ని పూర్తి చేస్తారని అన్నారు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ షోరూం, చమురు కంపెనీ యాప్‌ల్లో సైతం ఈ ప్రక్రియను తేలికగా పూర్తి చేయవచ్చునని చెప్పారు.