»Suspicious Death Of A Rich Family Of Indian Origin In America Massachusetts
Suspicious death: అమెరికాలో భారత సంతతి సంపన్న కుంటుంబం అనుమానాస్పద మృతి
భారత సంతతికి చెందిని ఓ సంపన్న కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. వారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Suspicious death: అమెరికా(America)లో భారత సంతతి(Indian origin)కి చెందిన ఓ సంపన్న కుటుంబం అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. రాకేష్ కమల్ (57), టీనా (54) భార్యాభర్తలతో పాటు వారి కుమార్తె అరియానా (18) అమెరికాలోని మాసాచుసెట్స్(Massachusetts) రాష్ట్రంలో తమ విలాసవంతమైన భవనంలో విగతజీవులుగా కనిపించారు. గత రెండు రోజులుగా వారినుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వారి బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి వచ్చిన పోలీసు ఆఫీసర్లకు మూడు డెడ్ బాడీలు కన్పించాయి. రాకేష్ మృతదేహం వద్ద తుపాకీని గుర్తించారు.
రాకేష్ తన భార్య, కుతుర్ని కాల్చేసి తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా ఇంకేదైనా జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరికి అప్పులు ఉన్నట్లు, అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారు అమెరికాలో సంపన్నులుగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం వీరు 11 బెడ్రూంలు ఉన్న ఖరీదైన భవనంలో నివాసం ఉంటున్నారు. ఆ భవనం విలువ భారత కరెన్సీలో రూ.41 కోట్లు ఉంటుందని మీడియా కథనాలు ప్రచురించాయి. రాకేశ్ కమల్, టీనా దంపతులు 2016లో ఎడ్యునోవా పేరిట విద్యారంగానికి సంబంధించిన ఓ సంస్థను ప్రారంభించారు. తరువాత 2021లో అది మూతపడింది. అప్పటినుంచి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని, గతంలో వీరు దివాలా పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తోంది.