»Airplane Stuck Under A Bridge In Bihar People Flew For Selfies
Airplane stuck: బ్రిడ్జి కింద ఇరుక్కున్న విమానం.. సెల్ఫీలకోసం ఎగబడ్డ జనాలు
విమానాన్ని ట్రక్కుపై తీసుకెళ్తుండగా ఒక బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. దాంతో జనాలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Airplane stuck under a bridge in Bihar.. People flew for selfies
Airplane stuck: విమానం(Airplane) కాస్త తక్కువ ఎత్తులో వెళ్తేనే జనాలు మంత్రముగ్దులై చూస్తూ ఉండిపోతారు.. అలాంటిది ఏకంగా రోడ్డుపై వస్తే ఎలా ఉంటుంది. భారీగా ప్రజలు గుమిగూడి, ట్రాఫిక్ నిలిచిపోయి, గోలగోల చేస్తారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి బీహార్లో చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన ఓ పాత విమానాన్ని ముంబై(Mumbai) తరలిస్తుండగా బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. ట్రక్కు నడిరోడ్డుపై ఆగింది. దానిపై విమానం ఉండడంతో జనాలు పెద్ద ఎత్తున గుమిగూడారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అస్సాం నుంచి ట్రక్కుపై పాత విమానాన్ని తరలిస్తుండగా బీహార్(Bihar) లోని మోతిహారి(Motihari) ప్రాంతంలో ఓ బ్రిడ్జి కింద చిక్కుకుపోయింది. బ్రిడ్జి కాస్త చిన్నగా ఉండడంతో డ్రైవర్ అంచనా వేయలేకపోయాడు. దాంతో సగం వరకు వెళ్లీ మధ్యలో ఇరుక్కుంది. ట్రక్కు ముందుకు వెళ్లడం సాధ్యం కాలేదు. వెనక్కి రావడానికి కూడా వీలు పడలేదు. రోడ్డుపై ప్రయాణికులు తమ వాహనాలను పక్కనపెట్టి సెల్ఫీలకోసం ఎగబడ్డారు. ఫలితంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. చాలా సమయం తరువాత విమానం ఉన్న ట్రక్కు టైర్లలో గాలిని తగ్గించారు అధికారులు. ఎత్తు కాస్త తగ్గడంతో ట్రక్కు ముందుకు కదిలింది. తరువాత టైర్లలో గాలిని నింపారు. అక్కడినుంచి ట్రక్కు కదిలింది.