»2 Planes Narrowly Escape Mid Air Collision 159 People Survived Watch Video
Viral Video : రెండు విమానాల్లో 159మంది ప్రాణాలు..గాలిలో తృటిలో తప్పిన పెను ప్రమాదం
న్యూయార్క్‌లోని సిరక్యూస్ హాన్కాక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలకు గాల్లో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాల్లో ఉన్న 159మంది తృటిలో తప్పించుకున్నారు.
Viral Video : న్యూయార్క్‌లోని సిరక్యూస్ హాన్కాక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలకు గాల్లో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాల్లో ఉన్న 159మంది తృటిలో తప్పించుకున్నారు. జూలై 8న నార్త్ సిరక్యూస్ పోలీస్ డిపార్ట్మెంట్ పెట్రోలింగ్ కారుపై అమర్చిన కెమెరా ద్వారా ఈ భయానక క్షణం రికార్డైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. రెండు విమానాలు వాణిజ్య విమానయాన సంస్థలకు చెందినవి. ఒక విమానం PSA ఎయిర్‌లైన్స్ 5511.. మరొకటి ఎండీవర్ ఎయిర్ 5421. జులై 8న ఉదయం 11:50 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని ఎఫ్ఏఏ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. సిరక్యూస్ హాన్కాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ఒక విమానం నుండి విడిపోవాలని PSA ఎయిర్‌లైన్స్ 5511ని ATC ఆదేశించింది. అది అదే రన్‌వే నుంచి టేకాఫ్ తీసుకుంది.
ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడార్ 24 డేటా ఆధారంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన నివేదికలో.. వాషింగ్టన్ నుండి వస్తున్న PSA విమానం, న్యూయార్క్ వెళ్తున్న ఎండీవర్ ఎయిర్ ఫ్లైట్ ఒకదానికొకటి 700-1000 అడుగుల దూరంలో నిలబడి ఉన్నాయని పేర్కొంది. PSA ఎయిర్‌లైన్స్ 5511లో 75 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఎండీవర్ ఎయిర్ 5421లో 76 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇద్దరు పైలట్లు, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. అయితే రెండు విమానాలు ఢీకొనే అవకాశాలు సమంగా లేవని నిపుణులు చెబుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణ ప్రారంభంలో PSA 5511ని ల్యాండ్ చేయడానికి.. అదే రన్‌వే 28 నుండి టేకాఫ్ చేయడానికి ఎండీవర్ ఎయిర్ 5421ని క్లియర్ చేసింది.