MNCL: పూర్వపు సింగరేణి ఉద్యోగి, ప్రస్తుత కార్మిక శాఖ సహాయక కమిషనర్ (హైదరాబాద్) దుర్గం క్రాంతి సోమవారం మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రూప్–1లో అసిస్టెంట్ లేబర్ కమిషనర్గా క్రాంతి ఎంపిక కావడం పట్ల జీఎం హర్షం వ్యక్తం చేశారు. యువ కార్మికులకు ఆదర్శంగా నిలిచిన క్రాంతి ప్రగతిని ఆయన అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.