AP: తెలుగువాళ్లు కలిసుంటే ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. NTR హయాంలో ఉమ్మడి ఏపీలో పలు ప్రాజెక్టులు కట్టామని, తన హయాంలో TGలో కల్వకుర్తి, AMR, నెట్టెంపాడు పూర్తి చేశామన్నారు. భీమా కూడా తన హయాంలోనే పూర్తయిందన్నారు. గోదావరిపై ఉమ్మడి ఏపీలో అనేక ప్రాజెక్టులు కట్టామన్నారు. గతేడాది కృష్ణా, గోదావరి నుంచి 6 వేల TMCలు సముద్రంలోకి వెళ్లాయని పేర్కొన్నారు.