TG: నైతిక విలువలు లేని BRS పార్టీలో ఉండదలుచుకోలేనని MLC కవిత శాసన మండలిలో వెల్లడించారు. అందుకే తన రాజీనామాను ఆమోదించాలని కోరుకుంటున్నట్లు ఛైర్మన్‌కు తెలిపారు. BRS వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ సర్కార్ సక్సెస్ అయ్యిందంటూ కొనియాడారు. గత ప్రభుత్వ పాలన లాగే కాంగ్రెస్ పనితీరు ఉండకూడదని సూచించారు. ఏ పార్టీ అయినా రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలని ఆకాంక్షించారు.