విమాన ప్రయాణానికి టికెట్ కొనుక్కోవాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సిందే. అయితే మన దేశంలో ఒక రూట్లో మాత్రం రూ.349కే విమాన టికెట్ దొరుకుతుందట. ఇంకా కొన్ని రూట్లలో వెయ్యి కంటే తక్కువలోనే టికెట్లు దొరుకుతాయట. ఎక్కడంటే...?
Independence Day Sale, Spicejet bumper offer for air travelers.. flight ticket for just Rs.1515
cheapest flight tickets : విమాన ప్రయాణం అంటే వేలల్లో ఖర్చు చేయాల్సిందే. అప్పుడప్పుడూ ఆఫర్లలో చాలా అరుదుగా వెయ్య, పదిహేను వందల రూపాయల దగ్గర్లో టికెట్లు దొరుకుతూ ఉంటాయి. అయితే అస్సాంలోని లిలాబరి నుంచి తేజ్ పూర్ మధ్య 50 నిమిషాల ప్రయాణం ఉంటుంది. ఇందుకు గాను అక్కడ తిరిగే విమానాలు రూ.349కే విమాన టికెట్టును ఆఫర్ చేస్తుంటాయి. ఎందుకంటే..
ఎప్పుడో ఆఫర్లు ఉన్నప్పుడే కాదండి. ఈ రూట్లో తరచుగా ఇదే రేటు మీద టికెట్లు అమ్ముతుంటారు. ఈ టికెట్టులో రూ.150 బేస్ఛార్జీ కాగా, కన్వీనియన్స్ ఛార్జీ కింద రూ.199 విధిస్తారు. దీనితో టికెట్టు ధర రూ.349 అవుతుంది. అయితే ఈ ఒక్కచోటే కాదండీ దేశంలోని పలు చోట్ల రూ.1000 కంటే తక్కువ బేస్ టికెట్ ధరతో పలు విమాన(flight) సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
తక్కువ రేట్లలో టికెట్లు(tickets) ఉండే ఈ విమానాలన్నింటినీ ‘ప్రాంతీయ విమాన అనుసంధానత పథకం(ఉడాన్)’ కింద పరిగణిస్తారు. ప్రభుత్వం నుంచి ఈ పథకం కింద విమాన యాన సంస్థలకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. దీంతో సంబంధిత సంస్థలు ఇలా చౌక ధరలకు టికెట్లను అందిస్తుంటారు. ఇలా ఉడాన్ పథకం కిందకి వచ్చే రూట్లన్నీ ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయి. దక్షిణాదిన దీని కింద బెంగళూరు – సేలం, కొచ్చి – సేలం రూట్లు ఉన్నాయి. గువాహటి – షిల్లాంగ్ల మధ్య బేస్ టికెట్ ధర రూ.400 గా ఉంది.