»Iconstar Allu Arjun Pushpa 2 The Rule Teaser Creating New Records
Pushpa-2 The Rule: రికార్డు బ్రేక్ చేసిన అల్లు అర్జున్ ‘పుష్ప-2 ది రూల్’ టీజర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2 కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. ఆగస్టు 15న విడుదల అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్ రెస్పాన్స్ చూస్తే దీనిపై ఎన్ని అంచనాలు ఉన్నాయో అర్థం అవుతుంది.
Iconstar Allu Arjun 'Pushpa-2 The Rule' Teaser Creating New Records
Pushpa-2 The Rule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మొదటి పార్ట్ పుష్ప ది రైజ్‌తో అందరిని ఆకట్టుకోని పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. అంతేకాదు పుష్ప సినిమాకు బెస్ట్ యాక్టర్‌గా జాతీయ అవార్డు కూడా సాధించారు. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇద్దరి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దానికి సీక్వెల్‌గా ప్రస్తుతం పుష్ప-2 ది రూల్ వెగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అంతే కాదు పార్ట్ 3 కూడా ఉంటుందని మూవీ యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది.
అన్యూహ్యమైన స్పందనతో వరల్డ్‌వైడ్‌గా సన్సేషన్ క్రియేట్ చేస్తుంది. యూట్యూబ్‌లో కంటిన్యూగా 138 గంటలపాటు ట్రెండింగ్‌లో నెంబర్‌వన్‌గా ఉన్న టీజర్ ఇదే. ఇక ఇప్పటి వరకు 110 మిలియన్ల వ్యూస్‌తో పాటు, 1.55మిలియన్ల లైక్స్‌తో అందరి రికార్డులు తిరగరాస్తుంది. మరిన్ని రికార్డులు కొల్లగొట్టే దిశగా పుష్ప-2 ముందుకు దూసుకెళ్తుంది. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేస్తున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై రూపోందుతున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.