Gold Rates Today : పదిరోజుల్లో పది వేలకు పైగా పెరిగిన బంగారం.. నేడు కొద్దిగా తగ్గుదల
గత పది రోజుల్లో పది వేలకు పైగా పెరిగిన బంగారం ధర శనివారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వెండి కూడా పసిడి దారిలోనే పయనించింది. ఏ లోహం ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. గత పది రోజుల్లో పది వేలకు పైగా పసిడి ధరలు పరుగులు పెట్టాయి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర శుక్రవారం రూ.75,172 ఉండగా, శనివారం నాటికి రూ.257 తగ్గి రూ.74,915కు చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.74,915గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
రూ. 86 వేల మార్కును దాటిని వెండి ధరలు శనివారం దేశీయ మార్కెట్లో తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం కిలో వెండి ధర రూ.86,427 ఉండగా, శనివారం నాటికి రూ.839 తగ్గి రూ.85,588కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి కొద్దిగా తగ్గుముఖం పట్టడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గాయి. శుక్రవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,385 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 41 డాలర్లు తగ్గి 2,344 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 27.90 డాలర్లుగా ఉంది.