Infosys Narayanamurthy gave an expensive gift to his grandson
Narayana Murthy: ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) గురించి అందరికి తెలిసిందే. తాజాగా ఆయన మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి ఓ ఖరీదైన బహుమతి ఇచ్చారు. ఇన్ఫోసిస్ కంపెనీలో 15 లక్షల షేర్లను రోహాన్ మూర్తి పేరు మీద రిజిస్టర్ చేశారు. అయితే వీటి విలువ సుమారు రూ.240 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. తన వాటా షేర్లలో కొన్నింటిని మనవడికి గిఫ్ట్‌గా ఇచ్చినట్లు బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపారు. ఇన్పోసిస్ కంపెనీలో నారాయణ మూర్తికి 0.40 శాతం వాటా ఉంది. ఆయన వద్ద 1.51 కోట్ల కంపెనీ షేర్లు ఉన్నాయి. నారాయణ మూర్తి కొడుకు రోహన్ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్‌లకు ఏకాగ్రహ్ జన్మించిన విషయం తెలిసిందే.
దీంతో ఏకాగ్రహ్‌కు ఇన్ఫోసిస్‌లో 0.04 శాతం వాటా లభించింది. ఈ బహుబతితో ఇండియాలో చిన్నవయసులో మిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇక నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులకు కూతురు అక్షతా మూర్తి, కొడుకు రోహన్ మూర్తి ఉన్నారు. రోహాన్ మూర్తి కుమారుడే ఏకాగ్రహ్. ఇక అక్షతా మూర్తి బ్రిటన్ అధ్యక్షుడు రిషి సునాక్‌ను పెళ్లి చేసుకుంది.